శ్రీశైలం: ఆత్మకూరు పట్టణంలో ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే 200వ జయంతి వేడుకలు
ఆత్మకూరు పట్టణంలోని సంగమేశ్వర సర్కిల్ వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా టీడీపీ పట్టణ, మండల అధ్యక్షులు వేణుగోపాల్, రవీంద్ర బాబు తదితరులు పూలేకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సమాజం కోసం నిరంతరం శ్రమించిన గొప్ప సంఘసంస్కర్త పూలే అని కొనియాడారు. మహిళా విద్య, సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన కృషి వల్లే నేడు మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారని స్పష్టం చేశారు. నేటి యువత పూలేను ఆదర్శంగా తీసుకొని సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం కూడా పాఠశాలలులో వసతి కల్పిస్తుందన్నారు.