గుంటూరు: నల్లపాడు సమీప శ్రీనివాస్ కాలనీ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒక వ్యక్తి మృతి
Guntur, Guntur | Sep 15, 2025 గుంటూరు నల్లపాడు రోడ్డులోని శ్రీనివాస కాలనీ వద్ద వినాయక స్వామి గుడి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తిని సోమవారం గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. మృతుని వివరాలు తెలిసినవారు నల్లపాడు పోలీసులకు 8688831590, 8688831376 నంబర్లకు తెలియజేయాలని కోరారు. ఈ ఘటనపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.