శ్రీశైలం: శ్రీశైలం టోల్గేట్ సమీపంలో క్లోజింగ్ గేటు ను ఢీకొన్న కారు .ఒక మహిళ మృతి ఏడుగురికి గాయాలు
శ్రీశైలం టోల్గేట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది మెదక్ కు జిల్లాకు చెందిన భక్తులు హైదరాబాదు నుండి శ్రీశైలం మల్లన్న దర్శనార్థం ఎర్టిక TS 15 FP 4020 అనే వాహనంలో క్షేత్రానికి చేరుకున్నారు రూమ్స్ తీసుకునేందుకు వెళ్తుండగా అతివేగంతో అలంకారేశ్వరస్వామి రోడ్డు క్లోజింగ్ గేటును డీ కొన్నారు ప్రమాదం సమయంలో కారులో 9 మంది భక్తులు ఉండగా అందులో రెండేళ్ల పాప కూడా ఉంది అందులో మల్లమ్మ (50) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది మరో 7 గురికి గాయాలయ్యాయి. స్థానిక దేవస్థానం వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.