శ్రీశైలం: NH 340C భానుముక్కల టర్నింగ్ వద్ద డైవర్షన్ మూసివేయడంతో ఆందోళన చేసిన గ్రామస్తులు
నేషనల్ హైవే 340 సి పై భానుముక్కల టర్నింగ్ వద్ద ఉన్న డైవర్షన్ అధికారులు గత వారం రోజుల క్రితం మూసివేశారు. దీంతో నేడు సోమవారం చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రయాణికులు నేషనల్ హైవే పై నిలబడి ఆందోళన చేశారు. దీంతో కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం కలిగింది. ఎన్నో రోజులుగా ఉన్న డైవర్షన్ను నేషనల్ హైవే అధికారులు మూసివేయడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.వెంటనే డైవర్షన్ ఓపెన్ చేయాలని వారు కోరారు. డైవర్షన్ మూసివేయడంతో బస్సులు రావడం లేదని వారు తెలియజేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులకు నచ్చచెప్పి ఆందోళన విరిమింప చేశారు.