గుంతకల్లు: పట్టణంలో దొంగలు బీభత్సం, నాలుగు ఇళ్లలో చోరీ, స్థానికులపై కత్తులతో బెదిరించి, రాళ్ళు రువ్వి పారిపోయిన దొంగలు
అనంతరపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని మోదీనాబాద్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. రైల్వే కాలనీలో వరుసగా నాలుగు ఇళ్లలో చోరీ చేశారు. సోమవారం బాధితులు తెలిపిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని రైల్వే క్వార్టర్స్ లో ఉండే రైల్వే ఉద్యోగులు నాగరాజు, నరసింహారెడ్డి, బాలాజీలు పట్టణంలో వివాహానికి వెళ్లగా దుండగులు తాళాలు పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. అర్ధరాత్రి సమయంలో వచ్చిన నాగరాజు సోదరుడు వీరేష్ లు ఇంట్లో దొంగలు చోరీ చేస్తున్నారని తెలుసుకొని బిగ్గరగా కేకలు వేసి స్థానికులను అప్రమత్తం చేశారు. దొంగలు పారిపోగా వారు వెంబడించగా కత్తులు విసిరి రాళ్ళు రువ్వి పారిపోయారు.