ఆరోగ్యమైన జీవన విధానానికి మొక్కలు ఎంతగానో దోహదపడతాయి, సామర్లకోటలో నిర్వహించిన స్వచ్ఛంద స్వచ్ఛదివాస్ కార్యక్రమంలో MLA
కాకినాడ జిల్లా సామర్లకోట పట్నం స్థానిక , గాంధీనగర్లో మున్సిపల్ కమిషనర్ శ్రీవిద్య ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛందర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మొదటగా స్థానికులు నాయకులు అధికారులు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్బంగా స్థానికులకు మొక్కలను పంపిణీ చేసి అనంతరం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు, ఈ సందర్భంగా రాజప్ప మాట్లాడుతూ, నివసించే ప్రాంతాలతో పాటు పట్నంలోని ప్రధాన వీధుల్లో పర్యావరణ సంతుల్యత కాపాడేందుకు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.