సంగారెడ్డి: వారానికి మూడు సదరం క్యాంపులు, ప్రతి క్యాంపులో 100 మందికి వైద్య పరీక్షలు : సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య
సదరం క్యాంపులు వారానికి మూడు రోజులు ఏర్పాటు చేయనున్నట్లు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య పేర్కొన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన సదరం క్యాంపును ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సదరం క్యాంపుకు ఎక్కువమంది వస్తున్నందున వారంలో మూడు రోజులు క్యాంపు పెట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 1249 మంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఈ నెలలో 14, 16, 18, 21, 23, 25, 30 తేదీల్లో సదరం క్యాంపులు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.