గుంతకల్లు: పేదరికం లేని సమాజం సీఎం చంద్రబాబుతోనే సాధ్యం, కసాపురంలో పింఛన్ల పంపిణీలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్
రాష్ట్రంలో పేదరికం లేని సమాజం స్థాపించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు మండల పరిధిలోని కసాపురం గ్రామంలో శనివారం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, అభివృద్ధి, తదితర వివరాలను ఎమ్మెల్యే ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మార్చి 1 ఆదివారం కావడంతో ఒక రోజు ముందే పింఛన్లు పంపిణీ చేశామన్నారు.