నారాయణపేట్: నారాయణపేట పట్టణంలో స్వచ్ఛందంగా వ్యాపార సంస్థలు బంద్
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం అమలు చేయడంలో జాప్యం చేస్తున్న సందర్భంగా బీసీ జేఏసీ తెలంగాణ రాష్ట్ర బంద్ కు ఇచ్చిన పిలుపులో భాగంగా నారాయణపేట పట్టణంలో వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. ఎస్ వి ఎస్ కళాశాల లో విద్యార్థులకు క్లాసులు నిర్వహిస్తుండగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడికి చేరుకొని బంద్ చేయించారు.