గన్నవరం: గన్నవరంలో ఆదివారం విద్యుత్ నిలిపివేత: ఈ ప్రాంతాల్లో కరెంట్ ఉండదు
కృష్ణాజిల్లా గన్నవరం సెక్షన్ పరిధిలో లైన్ మెయింటినెన్స్ పనుల వల్ల ఆదివారం ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దావాజీగూడెం రోడ్డు, శ్రీనగర్ కాలనీ, సుబ్బారావు నగర్, రాజీవ్ కాలనీ తదితర ప్రాంతాలకు ఇది వర్తిస్తుంది.