కోడుమూరు పట్టణంలో గ్రంథాలయ స్థలం కబ్జా చేస్తే సహించేది లేదని ప్రజాసంఘాల నాయకులు మండిపడ్డారు. ఆదివారం యూత్ రిక్రియేషన్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ దొంగ పట్టాలు సృష్టించుకుని లైబ్రరీ స్థలం కబ్జా చేస్తే పోరాటం తప్పదన్నారు. గ్రంథాలయ స్థలంలో అక్రమ నిర్మాణం చేస్తుంటే గ్రామపంచాయతీ పాలకవర్గం చర్యలు తీసుకోవడంలో జాప్యం ఎందుకని ప్రశ్నించారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.