బనగానపల్లె: సంజామల మండలంలో విషాదం, 20 జీవాలు మృతి
సంజామల మండల పరిధిలోని ముదిగేడులో అర్ధరాత్రి కురిసిన వర్షం ఓ రైతుకు కన్నీరును మిగిల్చింది. అవుకు మండలం జూనూతులకు చెందిన సుబ్బయ్య జీవాలను మేపుకుంటూ ముదిగేడు రైస్ మిల్లు వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా.. గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో 20 జీవాలు మృత్యు వాత పడ్డాయి. ఏడీలు డా. కొండారెడ్డి, డా.కిశోర్, MPDO సాల్మన్, VAS డా. కృష్ణ కుమార్, డీటీ అనిల్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.