హిందూపురం వైకాపా కార్యాలయం పై తెలుగుదేశం పార్టీ శ్రేణులు చేసిన దాడిని మడకశిర వైకాపా నేతలు శనివారం ఖండించారు. జిల్లా వైఎస్ఆర్సిపి ఎస్సీ సెల్ అధ్యక్షులు నరసింహమూర్తి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఇటువంటివి జరగకూడదని వైకాపా కార్యాలయం పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం అధ్యక్షులు శేషాద్రితోపాటు వైకాపా నాయకులు పాల్గొన్నారు.