పాతపట్నం: నరసన్నపేట మండల పరిషత్: తుది రోజున 29 నామినేషన్లు దాఖలు
నరసన్నపేట మండల పరిషత్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ తుది రోజున ప్రశాంతంగా ముగిసింది. వివిధ పార్టీల తరపున మొత్తం 29 నామినేషన్లు అందాయని ఎన్నికల అధికారి అనురాధ తెలిపారు. టీడీపీ 18, వైసీపీ 9, జనసేన 2 నామినేషన్లు దాఖలు చేశాయి. శనివారం నామినేషన్ల పరిశీలన చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.