రక్తదానంచేసి మరొకరి ప్రాణం నిలపడానికి తోడ్పడాలి,సామర్లకోట రక్తదానశిబిరంలో కాకినాడ
పార్లమెంటరీ రైతుఅధ్యక్షులు శ్రీనివాస్
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం జి.మేడపాడు గ్రామంలో ఆదివారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు, సీతారామ కమ్యూనిటీ హాల్ నందు, జిల్లా తూర్పు కాపు విద్య విజ్ఞాన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరంలో యువత అధిక సంఖ్యలో పాల్గొని, స్వచ్ఛందంగా రక్తాన్ని ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా కాకినాడ పార్లమెంటరీ తెలుగు రైతు అధ్యక్షులు పాలకుర్తి శ్రీనివాసచార్యులు చౌదరి మాట్లాడుతూ,ప్రమాదాలు జరుగుతున్న సమయంలో, సమయానికి రక్తం అందక అనేకమంది దుర్మరణం చెందుతున్నారని.యువత రక్తదానం చేయడంవల్ల అనేకమంది ప్రాణాలు కాపాడవచ్చు అన్నారు.