కనిగిరి :సింగరాయకొండలోని శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ నందు శిక్షణ పొందుతున్న విద్యార్థి తౌషిక్ అనుమానాస్పద మృతిపై విచారణ వేగవంతం చేయాలని కోరుతూ విద్యార్థి తల్లిదండ్రులు, స్థానికులు శుక్రవారం నిరసన ర్యాలీ చేపట్టారు.అనంతరం పామూరు బస్టాండ్ సెంటర్లో నడిరోడ్డుపై బైఠాయించి విద్యార్థి తల్లిదండ్రులు, స్థానికులు ధర్నా చేశారు. మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ మాట్లాడుతూ... విద్యార్థి మృతి చెంది 15 రోజులు గడిచినప్పటికీ ఇంతవరకు విచారణను వేగవంతం చేయలేదన్నారు. నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి, విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలన్నారు.