హిందూపురం విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయంలో విస్తృతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించిన శ్రీ సత్య సాయి జిల్లా SE
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయంలో శ్రీ సత్య సాయి జిల్లా సూపర్డెంట్ ఇంజనీర్ సంపత్ కుమార్,ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్ విస్తృతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు నిరంతరాయ విద్యుత్ సరఫరాపై ఎక్కడ పిర్యాదులు రాకుండా చూడాలి. లో ఓల్టేజ్ సమస్యలు రాకుండా అవసరమైన ప్లేసస్ లలో DTRs ఏర్పాటుచేయాలి.వ్యవసాయ విద్యుత్ సర్వీస్ కనెక్షన్ లలో జాప్యం చేయవద్దని మరియు నిబంధనల మేరకు తక్షణమే విడుదల చేయాలి.గృహ విద్యుత్ వినియోగదారులకు నచ్చ చెప్పి స్మార్ట్ మీటర్స్ ఏర్పాటు చేయాలని పీఎం సూర్య ఘర్ పథకం ప్రజలకు అవగాహన కల్పించాలన తెలిపారు