ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ సేవలను ప్రారంభించారు.
సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ సేవలు..ఎమ్మిగనూరు సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత అంబులెన్స్ సేవలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ మాలకొండయ్య హాజరై ప్రారంభించారు. సుందరయ్య విజ్ఞాన నిర్వాహకులు రామాంజనేయులు, డాక్టర్ మాలకొండయ్య మాట్లాడుతూ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులో అంబులెన్స్ సేవలు తీసుకురావడం సంతోష తగ్గ విషయం అన్నారు. తక్కువ ధరలతో పేద ప్రజలకు సేవలందించడం హర్షనీయమన్నారు.