శ్రీశైలం: 2014 ఐనమక్కల గ్రామంలో ఇంట్లో పులి చర్మాలు కలిగి ఉన్న కేసులో ముగ్గురు నిందితులకు మూడుసంవత్సరాల జైలు శిక్ష విధించిన కోర్టు
నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫ్లయింగ్ స్క్వాడ్ డివిజన్, ఆత్మకూరు అటవి శాఖ నమోదు చేసిన పులి చర్మాలు, పులి గోర్ల స్వాధీనం కేసులో ముగ్గురు నిందితులకు మార్కాపురం జిల్లా కోర్టు మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.50 వేల జరిమానా విధించింది. 2014లో ఐనముక్కల గ్రామంలో ఓ ఇంట్లో జరిగిన దాడిలో రెండు పులి చర్మాలు, పులి గోర్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. కోర్టు విచారణ పూర్తైన అనంతరం జూన్ 8న తీర్పు వెలువడగా, నిందితులను ఫ్లయింగ్ స్క్వాడ్ డివిజన్ అధికారులు నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు.