శ్రీశైలం: సున్నిపెంట నుంచి బ్రహ్మగిరి వరకు బస్సు సర్వీసును ప్రారంభించాలని శ్రీశైలం ఎమ్మెల్యేను కోరిన అచ్చంపేట ఎమ్మెల్యే
సున్నిపెంట నుంచి బ్రహ్మగిరి (దోమలపెంట) వరకు ఏపీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రారంభించాలని అచ్చంపేట (తెలంగాణ) ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డిని విజ్ఞప్తి చేశారు. మంగళవారం మధ్యాహ్నం ఆయనతో ఫోన్లో మాట్లాడారు. విద్యార్థుల సౌకర్యాన్ని, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని త్వరలోనే ఈ బస్సు సర్వీసు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి శ్రీశైలం ఎమ్మెల్యే బుద్ధా రాజశేఖర్ రెడ్డి సానుకూలంగా స్పందించి త్వరలోనే బస్సును పునరుద్ధరిస్తామని అన్నారు.