కంటాత్మకూర్ గ్రామంలో అకాల వర్షంతో నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని పరకాల MLA రేవూరి ప్రకాశ్ రెడ్డి వెల్లడి
హనుమకొండ జిల్లా,నడికూడ మండలం కంటాత్మకూర్ గ్రామంలో ఇటీవలే అకాల వర్షాలతో దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను అధికారులతో కలిసి పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి గారు పరిశీలించారు. పంట నష్టానికి గల కారణాలను రైతుల నుండి అడిగి తెలుసుకున్నారు.నష్టపోయిన రైతులను అన్నివిధాలుగాఆదుకుంటామని,సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టితో ప్రతి రైతు యొక్క నష్టపోయిన పంట నష్టంను అంచనా వేయాలని ఆదేశించారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.