ములుగు: జీవంతరావు పల్లి మూలమలుపు వద్ద డివైడర్‌ను బైక్ ఢీకొనడంతో ఒకరికి తీవ్ర గాయాలు
Mulug, Mulugu | Jul 5, 2025 ములుగు జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన డివైడర్ను ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలయ పాలైన సంఘటన చోటుచేసుకుంది. నేడు శనివారం రోజున సాయంత్రం ఏడు గంటలకు బండారుపల్లి వైపు నుండి ములుగు జిల్లా కేంద్రం వైపుగా ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తి అదుపుతప్పి జీవంతరావుపల్లి మూలమలుపు వద్ద డివైడర్ ను ఢీకొని క్రింద పడిపోయాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి 108 మరియు పోలీసులకు సమాచారం అందించారు.