శ్రీశైలం: శ్రీశైలంలో హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని వైభవంగా శోభాయాత్ర. ఆకట్టుకున్న చిన్నారుల విన్యాసాలు
శ్రీశైలంలో హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని వైభవంగా శోభాయాత్ర నిర్వహించారు. ప్రధాన ఆలయం ఎదురుగా ఉన్న గంగాధర మండపం నుంచి ప్రారంభమైన ఈ శోభాయాత్రలో స్థానికులు, భక్తులు భారీగా పాల్గొన్నారు. దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ రమేష్ నాయుడు పాల్గొన్నారు. చిన్నారుల కర్రసాము, కత్తిసాము, కోలాట విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రధాన ఆలయం నుంచి పలు కాలనీల మీదుగా సాగిన శోభాయాత్ర శివాజీ స్ఫూర్తి కేంద్రానికి చేరుకోగా, అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఛత్రపతి శివాజీ మహారాజ్ గొప్పతనంపై వక్తలు ప్రసంగించారు.