శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమం సందర్భంగా కళశాలతో మహిళల పెద్ద ఎత్తున ర్యాలీ
శ్రీశైల మహాక్షేత్రంలో సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాల్లో భాగంగా సోమవారం ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గంగాధర మండపం వద్ద కలశ యాత్ర, పంచాక్షరి మంత్ర లేఖనం పూజలు నిర్వహించారు. సాయంత్రం శివ భజనలు, భక్తి కార్యక్రమాలు ఉంటాయని అధికారులు తెలిపారు. ఓంకార మంత్ర జపం కార్యక్రమం చేపడుతున్నట్లు వివరించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.