అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోనే శ్రీకృష్ణదేవరాల విశ్వవిద్యాలయంలో గురువారం నాలుగు గంటల 25 నిమిషాల సమయంలో ఐక్య విద్యార్థి సంఘం నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు, ఈ సందర్భంగా ఐక్య విద్యార్థి సంఘం నాయకుడు వేమయ్య జైపాల్ తదితరులు మాట్లాడుతూ ఆర్డిటి స్వచ్ఛంద సంస్థ రాయలసీమ ప్రాంతంలో దశాబ్ద కాలంగా దళితులు ఆదివాసులు అభివృద్ధి కోసం ఎంతో కృషి చేయడం జరిగిందని యూనివర్సిటీ అభివృద్ధిలో కూడా ఆర్డిటి ఎంతో సహకారం అందించిందని అటువంటి ఆర్డిటికీ కేంద్ర ప్రభుత్వం ఎఫ్ సి ఆర్ ఏ రెన్యువల్ చేయాలని లేకుంటే పోరాటాలు చేస్తామని ఐక్య విద్యార్థి సంఘం నేతలు వేమయ్య జైపాల్ డిమాండ్ చేశారు.