రాష్ట్రంలోని మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ సీపీఐ నాయకులు వినూత్న రీతిలో భోగి మంటల్లో జీఓ కాపీలు కాల్చి నిరసన తెలిపారు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట బుధవారం భోగి మంటలు వేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విడుదల చేసిన 590, 847 నంబర్ జీఓ పేపర్లను సీపీఐ నాయకులు మంటల్లో వేసి కాల్చారు. ఈ సందర్భంగా సీపీఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి రమేష్, గుత్తి మండల కార్యదర్శి రామదాసు మాట్లాడుతూ పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విధానాన్ని సీపీఐ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని అన్నారు.