అనకాపల్లి జోన్ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి: GVMC ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు నరసింహమూర్తి
జీవీఎంసీ అనకాపల్లి జోన్ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని జీవీఎంసీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు నర్సింహా మూర్తి డిమాండ్ చేశారు. శనివారం తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సూపరింటెండెంట్ కు శనివారం అందజేశారు. బకాయి ఉన్న సరండర్ లీవ్, డీఏ ఏరియర్స్ ను మంజూరు చేయాలని కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు.