ఎమ్మిగనూరు: ఏపీ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 28న కలెక్టరేట్ ముట్టడి : జిల్లా సహా కార్యదర్శి బికాలప్ప
ఎమ్మిగనూరు లో చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా ప్రతి నేతన్నకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించినా ఇప్పటికీ అమలు కాలేదు. ఈ హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 28న కలెక్టరేట్ ముట్టడి నిర్వహించనున్నట్లు జిల్లా సహాయ కార్యదర్శి బికాలప్ప, జిల్లా ఉపాధ్యక్షులు కూరే కృష్ణ తెలిపారు