నర్సీపట్నం: చెరువులో పడిన బంతిని తీసేందుకు వెళ్లి విద్యార్థి మృతి
నర్సీపట్నం రూరల్ పరిధిలోని గురంధరపాలెం లక్ష్మమ్మ చెరువులో బంతి కోసం వెళ్లి 10వ తరగతి విద్యార్థి చరణ్ శ్రీనివాస్ రెడ్డి నీటిలో మునిగి మరణించాడు. అగ్నిమాపక సిబ్బంది గాలింపు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు. నీటి వనరుల వద్ద జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.