గుంతకల్లు: గుత్తి పట్టణంలోని తురకపల్లి రోడ్డులో విద్యుత్ తీగలు తగిలి పెయింటర్ మహేష్ కు తీవ్ర గాయాలు
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని తురకపల్లిరోడ్డులో పెయింటింగ్ పనులు చేస్తూ గమనించకుండా విద్యుత్ తీగలను తగలడంతో పెయింటర్ కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుత్తి పట్టణంలోని తురకపల్లి రోడ్డులో నారాయణ అనే వ్యక్తి ఇంటికి పెయింటింగ్ పనులు చేసేందుకు అనంతపురం జిల్లా శింగనమల మండలం కల్లుమడి గ్రామానికి చెందిన మహేష్ అనే యువకుడు ఇంటి పైకి ఎక్కి పెయింటింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. మెరుగైన చికిత్సలకు అనంతపురంకు తీసుకెళ్ళారు.