గుంటూరు: గుంటూరు బస్టాండ్ సమీపంలో ఓ లాడ్జిలో అనుమానస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి, పాత గుంటూరు పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు
Guntur, Guntur | Jun 5, 2025 గుంటూరు నగరంలోని పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్టాండ్ సమీపంలో ఉన్న లాడ్జిలో ఓ వ్యక్తి అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు. గురువారం లాడ్జి సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని విచారించారు. అనంతరం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చూరీకి తరలించారు. మృతుడు ఎవరు, ఎలా మృతిచెందాడనే అనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై అనుమానాస్పద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి వివరాలు తెలిసినవారు పాత గుంటూరు పోలీసులను సంప్రదించాలని పోలీసులు కోరారు.