శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో తుఫాను హెచ్చరిక: అప్రమత్తమైన కలెక్టర్
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారే సూచనలతో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను అప్రమత్తం చేశారు. 27 నుండి 29 వరకు భారీ వర్షాలు, 90 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.