గుంతకల్లు: మహిళలను కించపరిచిన ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలి, పట్టణంలో మాజీ ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి
రాష్ట్రంలోని మహిళలను కించ పరుస్తూ కొత్తపలుకులో రాసిన ఏబీఎన్ రాధాకృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం మాజీ ఎమ్మెల్యే విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ నేతలు, వారి భార్యలపై అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా హైదరాబాద్ లో ఏబీఎన్ ఛానల్ ఆఫీస్ ముందు నిరసన చేస్తే దాడి చేశారని రాశారని అన్నారు.