శ్రీశైలం: బండిఆత్మకూరు మండలంలోని పలు గ్రామాలలో నిర్మించిన నూతన సిసి రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి
బండి ఆత్మకూరు మండలంలోని పలు గ్రామాల్లో నిర్మించిన నూతన సిమెంట్ రోడ్లను ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం ప్రారంభించారు. బండి ఆత్మకూరు మండలంలోని సింగవరం గ్రామంలో 20 లక్షల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్డు కడమకాలవ గ్రామంలో 20 లక్షలు నిర్మించిన సిసి రోడ్డు అలాగే వెంగళరెడ్డిపేట గ్రామంలో నిర్మించిన పది లక్షల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.