నాగలాపురం: నందనం గ్రామ సమీపంలో లంకలో పడి వృద్ధుడు మృతి
నాగులాపురం మండలంలోని నందనం గ్రామానికి వెళ్లే దారిలో ఉన్న వంక వద్ద నీటిలో పడి వ్యక్తి మరణించిన విషయాన్ని స్థానికులు బుధవారం గుర్తించారు. డెడ్ బాడీని గ్రామానికి చెందిన కుమ్మర కుప్పయ్య (60)గా స్థానికులు గుర్తించారు. విషయం తెలుసుకున్న వీఆర్వో సుకుమార్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.