జీవిత ఖైదు పడిన 12 మంది ముద్దాయిలను నంద్యాల నుంచి కడప సబ్ జైలుకు తరలించిన పోలీసులు
Nandyal Urban, Nandyal | Mar 30, 2026
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం పెద్దచింతకుంట గ్రామంలో 2012 సంవత్సరంలో సంచలనం సృష్టించిన నలుగురి హత్య కేసులో న్యాయస్థానం సోమవారం కీలకతీర్పు వెల్లడించిన విషయం విదితమే. ఈ కేసుకు సంబంధించి 12 మంది ముద్దాయిలను నంద్యాల నుంచి ఎస్కార్ట్ నడుమ ప్రత్యేక వాహనంలో కడప సబ్ జైలుకు తరలించారు. . కోర్టు ప్రాంగణంలో కుటుంబ సభ్యులు రోదించారు.