గుంతకల్లు: పట్టణంలో అగ్నిప్రమాదాలపై ప్రజలు ప్రయాణికులకు అవగాహన కల్పించిన అగ్నిమాపక సిబ్బంది
అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ లో అగ్ని ప్రమాదాలపై ప్రయాణికులకు అవగాహన కల్పించారు. బుధవారం జరిగిన కార్యక్రమంలో జిల్లా సహాయ అగ్నిమాపక అధికారి అశ్వర్థ సిబ్బందితో కలిసి అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు వివరించారు. పెట్రోల్ బంకుల దగ్గర వాహనాలలో పెట్రోల్ వేసే పంపుమేన్ లకు అవగాహన కల్పించారు. ట్రావెలర్స్ బంగ్లా సర్కిల్ లో బంకు లలో పెట్రోల్ విక్రయిస్తున్న పెట్రోల్ తో జరిగే ప్రమాదాల గురించి వివరించారు. ముఖ్యంగా మండు స్వభావం కలిగిన వస్తువులు ఇళ్లలో జాగ్రత్తగా ఉంచుకోవాలన్నారు. అగ్ని ప్రమాదాల నివారణ గురించి కర పత్రాలు అందజేశారు.