ఖాజీపేట: కాజీపేటలో పోలీసుల వినూత్న కార్యక్రమం: జమ్మి ఆకులతో గంజాయిపై అవగాహన
హనుమకొండ జిల్లా కాజీపేటలో దసరా సందర్భంగా పోలీసులు వినూత్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జమ్మి ఆకులను పంచుతూ, గంజాయి నిర్మూలనపై ప్రజలకు, వాహనదారులకు అవగాహన కల్పించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు.