జమ్మికుంట: కొత్తపల్లి ఫ్లైఓవర్ వద్ద మధుకర్ అనే వ్యక్తి అజాగ్రత్తగా బైకు నడిపి మరో బైక్ ను ఢీకొన్న ఘటనలో కుమార్ అనే వ్యక్తి మృతి
జమ్మికుంట: జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెంకట్రావ్ పల్లి గ్రామానికి చెందిన జోడు కుమార్ పని నిమిత్తం జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని అబాది జమ్మికుంటకు వచ్చి తిరిగి స్వగ్రామం వెళ్తుండగా కొత్తపల్లి ఫ్లైఓవర్ దిగుతుండగా రామన్నపల్లి గ్రామానికి చెందిన మధుకర్ అనే వ్యక్తి అజాగ్రత్తగా అతివేగంగా బైక్ నడుపుతూ జోడు కుమారు బైక్ ను ఢీకొనడంతో కుమార్ తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందగా మృతుని తల్లి జోడు సమ్మక్క శనివారం సాయంత్రం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ రామకృష్ణ తెలిపారు.