నిర్మల్ జిల్లా కేంద్రంలో ఐటి అధికారుల దాడులు కలకలం రేపాయి. జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ లో గల బంగారు దుకాణంలో రెండు గంటలపాటుగా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆదిలాబాద్ కు చెందిన ఇన్కమ్ టాక్స్ అధికారి పార్థసారథి ఆధ్వర్యంలో అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. బంగారు దుకాణంలో జరిగిన క్రయవిక్రయాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ దాడుల నేపథ్యంలో గాంధీ చౌక్ లోని కొన్ని బంగారు దుకాణాలు మూసి ఉంచడం గమనారం.