పదోన్నతి పై బదిలీ ఐ వెళ్తున్న పెద్దాపురం ఎంపీడీవో శ్రీ లలితను సత్కరించిన ఎమ్మెల్యే మరియు డిసిసిబి చైర్మన్.
పెద్దాపురం మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారిగా సేవలందించి,ప్రదోన్నతపై బదిలీపై వెళ్తున్న శ్రీ లలితను ఎమ్మెల్యే నిమ్మకాయ చినరాజప్ప, డి సి సి బి చైర్మన్ తుమ్మల రామస్వామి ఘనంగా సత్కరించారు. చేసిన సేవలే స్థిరస్థాయిగా నిలిచిపోతాయని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. ఇప్పటివరకు పెద్దాపురం మండలంలో ఎంపీడీవో గా శ్రీ లలిత చేసిన సేవలు ప్రజల హృదయాలలో స్థిరస్థాయిగా నిలిచిపోతాయని ముఖ్య అతిథులు పేర్కొన్నారు కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మండల ప్రజాపరిషత్ కార్యాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయం సిబ్బంది,ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.