మడకశిరలో జనసేన పట్టణ ఉపాధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వీడియో వైరల్. జన సైనికులను గుర్తించలేదని ఫైర్.
నిన్న మడకశిరలో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి పర్యటనలో మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తో పాటు అనంతపురం కి చెందిన జనసేన పార్టీ నాయకుడు స్వచ్ఛ్ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ రవి కుమార్ పాల్గొన్నారు.కానీ పేపర్ స్టేట్మెంట్తో మా నాయకుడి పేరు లేదని మడకశిర పట్టణ జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశాడు. మీరు మాత్రం కౌన్సిలర్ పేరు నుంచి వార్డ్ ఇంచార్జ్ వరకు పేర్లు ఉంటాయి..కూటమిలో భాగమైన జనసేన పార్టీకి సంబంధించి జిల్లా నాయకుల పేర్లు కూడా రావు. మా పేర్లు పేపర్ స్టేట్మెంట్లో లేకున్నా జిల్లా నాయకుల పేర్లు ఉండాలి కదా ఎందుకు ఇంత అవమానం చేస్తున్నారన్నాడు.