ప్రజల భద్రత కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని నిర్మల్ రూరల్ సీఐ కృష్ణ తెలిపారు. శనివారం నర్సాపూర్ జి మండలం రాంపూర్ గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన ధ్రువపత్రాలు లేని 74 బైకులు, రెండు ఆటోలు, ఒక కార్ సీట్ చేశారు. అనంతరం సమావేశంలో వారు సీసీ కెమెరాల ప్రాముఖ్యత, సైబర్ క్రైమ్ నివారణ, టోల్ ఫ్రీ నెంబర్ 1930 ప్రయోజనాలను వివరించారు. ఇందులో ఎస్ఐలు గణేష్ ,రవీందర్ పోలీసులు పాల్గొన్నారు.