గన్నవరం: హనుమాన్ జంక్షన్లో ఘోర రోడ్డు ప్రమాదం: గ్రిల్స్‌ను ఢీకొట్టిన బైక్, యువకుడు మృతి
కృష్ణాజిల్లా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం అదుపుతప్పి గ్రిల్స్‌ను ఢీకొనడంతో యువకుడు అక్కడికక్కడే మరణించాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.