కూటమి ప్రభుత్వంలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి. భరత్ అన్నారు. రాష్ట్రంలో స్ట్రెబుల్ గవర్నమెంట్ తో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ఆలయాల అభివృద్ధి, టూరిజం ప్రోత్సాహం, పరిశ్రమల విస్తరణ ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం, రాష్ట్ర పురోగతే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు.