కాకినాడ సిటీ: కాకినాడలో ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉన్న ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పరిశీలించారు. ఈవీఎంలు, వీవీప్యాట్ల భద్రతను పర్యవేక్షించి, ఈ మేరకు నివేదికను భారత ఎన్నికల సంఘానికి పంపాలని అధికారులను ఆదేశించారు.