శ్రీశైలం: కామేశ్వరి సమేత మహానంది ఈశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి
మహానంది పుణ్యక్షేత్రంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభానేని బాలశౌరి పూజలు నిర్వహించారు. మంగళవారం వీరికి ఆలయ పర్యవేక్షకులు సుబ్బారెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. శ్రీ కామేశ్వరి దేవి సహిత మహానందీశ్వర స్వామి అమ్మవార్లను దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన పూజలు నిర్వహించుకున్నారు. పూజల అనంతరం అధికారులు శేష వస్త్రంతో సత్కరించగా, వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఎంపీ వెంట మండల జనసేన నాయకులు పాల్గొన్నారు.