నిర్మల్: ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావనను అలవర్చుకోవాలని సూచించిన కడ్తాల్ అయ్యప్ప ఆలయ గురుస్వామి నర్సారెడ్డి
Nirmal, Nirmal | Sep 22, 2025 ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావనను అరవర్చుకోవాలని గురుస్వామి నర్సారెడ్డి తెలిపారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం సోన్ మండలంలోని కడ్తాల్ అయ్యప్ప ఆలయంలో భవాని మాలాదారులు గురుస్వామి చేతుల మీదుగా మాలాధారణ స్వీకరించారు. నవరాత్రి ఉత్సవంలో మాలాధారులు దీక్ష సమయంలో తీసుకోవలసిన ఆధ్యాత్మిక అంశాలపై వారికి వివరించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.