ఆళ్లగడ్డ: అహోబిలంలో అంగరంగ వైభవంగా విజయదశమి శమీ పారువేట ఉత్సవం
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని అహోబిలంలో మంగళవారం విజయదశమి సందర్భంగా శమీ పారువేట ఉత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు, శ్రీ ప్రహల్లాద వరద స్వామి వారికి అమ్మవార్లకు నవ కలశ పూర్వక పంచామృత అభిషేకం నిర్వహించారు సాయంత్రం స్వామివారిని మంగళగిరి ప్రభలో ఊరేగింపుగా చెంచు కాలనీలోని జమ్మి చెట్టు శమీ వృక్షం వద్దకు తీసుకుని వెళ్లి శమీ వృక్ష పూజ ఆయుధపూజ నిర్వహించారు భక్తులు భారీగా తరలివచ్చారు