శ్రీశైలం: శ్రీశైలంలో భారీగా భక్తుల రద్దీ.స్వామి అమ్మవార్ల దర్శనానికి 6 సమయం
శ్రీశైలంలో భారీగా భక్తుల రద్దీ పెరిగింది.స్వామి అమ్మవార్ల దర్శనానికి 6 గంటల సమయం పడుతుందని ఈవో శ్రీనివాసరావు తెలియజేశారు .ఇంటర్ పరీక్ష ఫలితాలు రావడంతో స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు శ్రీశైలం చేరుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి శ్రీశైలం వస్తున్నారు భక్తులు.శ్రీశైల క్షేత్రం అంతా భక్తజన సందడితో నెలకొననుంది.